: కనిపించకుండా పోయిన మాజీ ఎమ్మెల్యే కుంజా భిక్షం క్షేమం!
ఖమ్మం జిల్లా బూర్గంపాడు మాజీ ఎమ్మెల్యే కుంజా భిక్షం క్షేమంగా ఉన్నారు. తిరుపతి సమీపంలోని కరకంబాడి సమీపంలో ఆయన దొరికారు. స్థానికులు ఆయనను గుర్తించి సమాచారమివ్వడంతో... ఆయన ఆచూకీ లభ్యమైంది. నిన్నటి నుంచీ ఆహారం లేకపోవడంతో ఆయన బాగా నీరసించి పోయారు. తిరుమల వేంకటేశ్వరస్వామివారి దర్శనానికి కుటుంబసభ్యులతో కలసి వెళ్లిన ఆయన... నిన్నటి నుంచి కనిపించకుండాపోయారు. ఆయన కోసం తీవ్ర గాలింపు చేపట్టినప్పటికీ ఆయన ఆచూకీ లభించలేదు. ఆయన అదృశ్యమైన వార్తలు ఇరు రాష్ట్రాల్లో సంచలనం రేకిత్తించాయి. చివరకు ఆయన క్షేమంగా దొరకడంతో కుటుంబసభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.