: చైనా నోబెల్ ఖైదీకి మెడికల్ పెరోల్ మంజూరు!
ప్రజాస్వామ్య సంస్కరణల గురించి పిటిషన్ దాఖలు చేసిన నేరం కింద 2008లో అరెస్టైన నోబెల్ శాంతి బహుమతి గ్రహీత లియూ జియాబోకి చైనా కోర్టు మెడికల్ పెరోల్ జారీ చేసింది. గతనెల కేన్సర్ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లుగా గుర్తించిన వైద్యుల నివేదికతో ఆయనకు ఈ పెరోల్ మంజూరు చేశారు. తన 11 ఏళ్ల శిక్షకాలంలో 3 ఏళ్లు పూర్తి చేసుకున్నారు లియూ.
2008లో చైనాలోని ఏకపార్టీ కమ్యూనిస్ట్ విధానాలను వ్యతిరేకిస్తూ లియూ ఓ చార్టర్ విడుదల చేశారు. ఈ కారణంతో ఆయనకు శిక్ష విధించారు. చైనాలో మానవ హక్కుల గురించి పోరాటం చేసినందుకు 2009లో నోబెల్ సంస్థ ఆయనకు శాంతి బహుమతిని ప్రకటించింది. ఇందుకు చైనా మా దేశ సమస్యలో విదేశీ జోక్యం ఏంటని లియూని అవార్డు ప్రదానోత్సవానికి వెళ్లకుండా అడ్డుకుంది. దీంతో ప్రదానోత్సవం కార్యక్రమంలో ఖాళీ కుర్చీ వేసి ఆయన పరోక్షంలో అవార్డును ప్రదానం చేశారు.