: రంజాన్ ప్రార్థనలు ముగియగానే.. బయటకొచ్చి రాళ్లు రువ్వారు!
పవిత్రమైన రంజాన్ రోజున కూడా కశ్మీర్ లో అల్లరిమూకలు రెచ్చిపోయాయి. ఈద్ ప్రార్థనలు ముగిసిన వెంటనే శ్రీనగర్ సహా పలు ప్రాంతాల్లో ఘర్షణలు చోటు చేసుకున్నాయి. శ్రీనగర్ లో ఉన్న అతి పెద్ద మైదానం ఈద్ఘా బయట అల్లరి మూకలు పోలీసులతో ఘర్షణకు దిగాయి. నమాజ్ పూర్తయిన వెంటనే బయటకు వచ్చిన దుండగులు పోలీసులపై రాళ్లు రువ్వారు. దీంతో, పోలీసులు టియర్ గ్యాస్ ను ఉపయోగించారు. అరగంట తర్వాత ఆందోళనకారులను పోలీసులు చెదరగొట్టారు. దక్షిణ కశ్మీర్ లోని అనంత్ నాగ్ పట్టణంలో సైతం సుమారు గంటసేపు అల్లర్లు చోటు చేసుకున్నాయి. ఈద్ ప్రార్థనలు ముగిసిన తర్వాత జంగ్లత్ మండి వద్ద ఆందోళనకారులు పోలీసులతో ఘర్షణకు దిగారు.