: 55 గంటల్లో 55,55,555 క్లిక్స్: దగ్గుబాటి రానా
యంగ్ హీరో దగ్గుబాటి రానా, దర్శకుడు తేజ కాంబినేషన్ లో వస్తున్న 'నేనే రాజు నేనే మంత్రి' మూవీ ట్రైలర్‌కు విశేష స్పందన వస్తుండడంతో రానా ఫుల్ ఖుషీ అవుతున్నాడు. బాహుబలిలో భల్లాలదేవుడిలాంటి పవర్ ఫుల్ పాత్రలో కనిపించిన అనంతరం రానా చేస్తోన్న సినిమా కావడంతో ఈ సినిమాపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే ఈ టీజర్ అత్యధిక క్లిక్స్‌తో యూ ట్యూబ్‌లో దూసుకుపోతోంది.
‘నా కొత్త సినిమా యాభై ఐదు లక్షల, యాభై ఐదు వేల, ఐదు వందల యాభై ఐదు క్లిక్స్‌ని 55 గంటల్లో సాధించింది.. ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను’ అంటూ రానా తెలుగులో ట్వీట్ చేసి సంతోషం వ్యక్తం చేశాడు. ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై దగ్గుబాటి సురేష్ బాబు నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్‌లుగా కాజల్ అగర్వాల్, కేథరిన్ నటిస్తున్నారు.