: అత్తను టెర్రస్ పై నుంచి కిందకు తోసేసిన కోడలు!


ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ఇటాలో దారుణ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఓ కోడ‌లు త‌న అత్త‌ను టెర్ర‌స్‌పై నుంచి కిందకు తోసేసింది. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు వివ‌రాలు తెలిపారు. ఊర్మిళ దేవి అనే మ‌హిళ త‌న‌కు ఆస్తి రాసివ్వాలంటూ కొంత కాలంగా త‌న అత్త ప్రేమ్ దేవిను కోరుతోంది. ప్రేమ్ దేవికి కొత్వాలిలో ఉన్న ఆస్తి త‌నకేద‌క్కాల‌ని ఆ కోడలు ప్లాన్‌లు వేస్తోంది.

 ఈ క్ర‌మంలోనే ప్రేమ్‌ దేవి త‌న కోడ‌లికి ఆస్తి రాసివ్వ‌డానికి అంగీక‌రించ‌కపోవ‌డంతో... నెల రోజులుగా అత్త‌తో గొడ‌వ ప‌డుతోంది. నిన్న త‌న‌ భర్త ఇంట్లో లేని సమయంలో ఊర్మిళ తన అత్తను టెర్రస్‌ పై నుంచి తోసేయ‌గా.. ప్రేమ్ దేవి చిన్న కొడుకు ఆమెను ఆసుపత్రికి తరలించాడు. ప్రేమ్‌దేవి ప‌రిస్థితి విష‌మంగా ఉంద‌ని వైద్యులు చెప్పారు. ఈ ఘ‌టనలో పోలీసులు ద‌ర్యాప్తు కొన‌సాగిస్తున్నారు.       

  • Loading...

More Telugu News