: 'రంగస్థలం' నుంచి మరో ఫొటో వదిలిన సమంత!
మెగాపవర్ స్టార్ రాంచరణ్ తేజ్, సమంత జంటగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న రంగస్థలం సినిమా సెట్స్ పై ఉండగానే సినీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ సినిమాకు సంబంధించిన రెండో ఫోటోను సమంత తన ఇన్ స్టా గ్రాంలో పోస్టు చేసింది. గతంలో కేవలం కాలి మువ్వలు కనిపించేలా దిగిన ఫోటోను పోస్టు చేసిన సమంత, ఈ సారి మాత్రం తన పాత్ర ఆహార్యాన్ని తెలుపుతూ పోస్టు చేసింది. అందులో బాధ, సంతోషం పెద్ద విషయం కాదు...కానీ కెమెరా మాత్రం అద్భుతాన్ని చూపిస్తుందని పోస్టు చేసింది. ఈ ఫోటోలో సమంత లంగాఓణిలో అచ్చతెలుగు అమ్మాయిలా కనిపిస్తోంది. ఇది ఆమె అభిమానులను ఆకట్టుకుంటోంది.