: ఉపరాష్ట్రపతి రేసులో విద్యాసాగర్ రావు?


భారత ఉపరాష్ట్రపతి రేసులో మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్.విద్యాసాగర్ రావు పేరు తెరపైకి వచ్చింది. దేశంలోని రాజ్యాంగబద్ధమైన అత్యున్నత పదవుల్లో రెండోదైన ఉపరాష్ట్రపతికి ఆయన పేరును పరిశీలిస్తున్నారనే వార్త ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆగస్టు 11వ తేదీతో ప్రస్తుత ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ పదవీకాలం ముగియనుంది. రాష్ట్రపతి అభ్యర్థిగా ఉత్తరాదికి చెందిన రామ్ నాథ్ కోవింద్ ను ఎన్డీయే తరపున బీజేపీ ఎంపిక చేసింది. ఈ నేపథ్యంలో, ఉప రాష్ట్రపతి పదవిని దక్షిణాది వ్యక్తికి కట్టబెట్టాలనే యోచనలో బీజేపీ అధిష్ఠానం ఉన్నట్టు సమాచారం. ఈ క్రమంలో ఈ పదవికి విద్యాసాగర్ రావు పేరు ఖరారయ్యే అవకాశాలను కొట్టి పారేయలేమని విశ్లేషకులు సైతం అంచనా వేస్తున్నారు. 

  • Loading...

More Telugu News