: బాలకృష్ణ సమక్షంలోనే నా ప్రమాణస్వీకారం: 'నుడా' నూతన ఛైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి


హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ తన ప్రమాణస్వీకారోత్సవానికి వస్తున్నారని నుడా నూతన ఛైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. ఆయన సమక్షంలో ప్రమాణస్వీకారం చేస్తానని చెప్పారు. ఈ నెల 30వ తేదీ సాయంత్రం 5.30 గంటలకు నెల్లూరులోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద ప్రమాణస్వీకార కార్యక్రమం ఉంటుందని ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా వీఆర్సీ నుంచి ఆర్ఆర్ స్ట్రీట్ లోని ఎన్టీఆర్ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమానికి మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నారాయణ, పార్టీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర తదితరులు హాజరవుతున్నారు. 

  • Loading...

More Telugu News