: రామ్ చరణ్ మూవీలో హాట్ యాంకర్!
బుల్లి తెరపై సందడి చేసే హాట్ యాంకర్ అనసూయ మరో బంపర్ ఆఫర్ కొట్టేసింది. రామ్ చరణ్ తాజా చిత్రం 'రంగస్థలం 1985'లో నటించే ఛాన్స్ ను ఈ భామ కొట్టేసింది. ఈ విషయాన్ని స్వయంగా ఆమే ధ్రువీకరించింది. 'రంగస్థలం' షూటింగ్ జరుగుతున్న ప్రదేశంలో నటీనటులకు స్వాగతం అంటూ ఉన్న ఫ్లెక్సీ ఫొటోను సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ చేసింది. దీంతో, ఈ సినిమాలో అనసూయ కూడా నటిస్తోందనే విషయం అర్థమవుతోంది. 'క్షణం', 'సోగ్గాడే చిన్నినాయనా' సినిమాల్లో అనసూయ అలరించిన సంగతి తెలిసిందే.