: శ్రవణ్, రాజీవ్ లను మరోసారి అదుపులోకి తీసుకున్న పోలీసులు
హైదరాబాదులోని ఫిల్మ్ నగర్ లోని ఆర్జీ స్టూడియోలో ఆత్మహత్యకు పాల్పడిన బ్యూటీషియన్ శిరీష కేసులో కేసులో ప్రధాన నిందితులు శ్రవణ్, రాజీవ్ లను బంజారాహిల్స్ పోలీసులు మరోసారి కస్టడీలోకి తీసుకోనున్నారు. ఈ ఘటనలో శిరీష ఆత్మహత్యకు పాల్పడలేదు, ఆమెను హత్య చేసి, పథకం ప్రకారం సూసైడ్ అంటున్నారని పేర్కొంటూ సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి ఆమె కుటుంబ సభ్యులు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో ఈ కేసులో నిజానిజాలు వెలికి తీసేందుకు బంజారాహిల్స్ పోలీసులు వారిని మరోసారి అదుపులోకి తీసుకోనున్నారు. చంచల్ గూడ జైలులో ఉన్న శ్రవణ్, రాజీవ్ లను మరోసారి విచారించి నిజానిజాలు బయటకు తీయనున్నారు. ఈ నేపథ్యంలో వారిని అదుపులోకి తీసుకునేందుకు చంచల్ గూడ జైలుకు వెళ్లారు.