: అఖిలప్రియ సవాల్ ను స్వీకరిస్తున్నానన్న శిల్పా మోహన్ రెడ్డి!


త్వరలో జరిగే నంద్యాల ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోతే తాను రాజకీయాలను వదిలి వెళ్తానని, శిల్పా కూడా అదే పని చేస్తారా? అని ఏపీ మంత్రి భూమా అఖిలప్రియ విసిరిన సవాల్ ను తాను స్వీకరిస్తున్నట్టు శిల్పా మోహన్ రెడ్డి ప్రకటించారు. ఉప ఎన్నికల్లో ఓడిపోతే తాను రాజకీయాలను వదిలేస్తానని ఈ ఉదయం కర్నూలులో మీడియాతో మాట్లాడుతూ, తెలుగుదేశం అధికార బలం ఈ ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థిని గెలిపించే సమస్యే లేదని అన్నారు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఉంటేనే భవిష్యత్తు ఉంటుందన్న నమ్మకం, కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నేతల భరోసాతోనే తాను పార్టీలో చేరానని అన్నారు. తాను తెలుగుదేశంలో ఉన్నా దివంగత మహానేత వైఎస్ఆర్ నిలువెత్తు చిత్రపటాన్ని తన ఇంట్లో ఉంచుకున్నానని, ఆయన చూపించిన అడుగుజాడల్లోనే నడుస్తానని తెలిపారు.

  • Loading...

More Telugu News