: ఇది నాకెంతో గర్వకారణం: కరణ్ జొహార్


తన సినీ ప్రయాణంలో పాతికేళ్ల కెరియర్ ను బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ పూర్తి చేసుకున్నాడు. బాలీవుడ్ లో షారుఖ్ కు అత్యంత సన్నిహితుడు ఎవరని ఎవర్ని అడిగినా టక్కున వచ్చే సమాధానం కరణ్ జొహార్. ఇండస్ట్రీలో షారుఖ్ కు అత్యంత సన్నిహితుడిగా కరణ్ కు పేరుంది. బాలీవుడ్ నటుడిగా షారుఖ్ పాతికేళ్లను పూర్తి చేసుకున్న సందర్భంగా తన మిత్రుడికి శుభాకాంక్షలు తెలిపాడు కరణ్. షారుఖ్ తో కలసి పని చేయడాన్ని ఒక గౌరవంగా తాను భావిస్తున్నానని కరణ్ ట్వీట్ చేశాడు. షారుఖ్ పాతికేళ్ల కెరియర్ లో తాను 22 ఏళ్లపాటు ఉన్నానని చెప్పాడు. ఇంతకాలం షారుఖ్ తో కలసి పనిచేయడం తనకు ఎంతో సంతోషాన్ని ఇస్తోందని తెలిపాడు.

  • Loading...

More Telugu News