: పార్కులో 25 అడుగుల ఎత్తు నుంచి పడిన అమ్మాయి.. ఒడిసిపట్టిన జనం ... ఆ థ్రిల్లింగ్ వీడియో చూడండి!
న్యూయార్క్ లోని ఓ అమ్యూజిమెంట్ పార్కులో గాలిలో రైడ్ కు వెళ్లిన 25 సంవత్సరాల యువతి ప్రమాదవశాత్తూ కాలుజారి, కేకలు పెడుతూ కిందపడి తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న ఓ వీడియో ఇప్పుడు వైరల్ అయింది. లేక్ జార్జ సమీపంలోని 'సిక్స్ ఫ్లాగ్స్ గ్రేట్ ఎస్కేప్' పార్కులో ఈ ఘటన జరుగగా, 'గొండోలా' రైడ్ కు వెళ్లిన ఓ జంటలోని యువతి, సేఫ్టీ బార్ కింద నుంచి జారిపోయింది.
ఆపై దాన్నే పట్టుకుని కాసేపు వేలాడింది. కింద నుంచి ఆమెను చూస్తున్న వారు పెద్దగా కేకలు వేస్తూ, సెక్యూరిటీ సిబ్బందిని అలర్ట్ చేశారు. వారు వచ్చేలోగా, ఆమె కిందకు దూకేయగా, చుట్టూ ఉన్నవారు పట్టుకున్నారు. అయినప్పటికీ, ఆమెకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ దృశ్యాన్నంతా పలువురు తమ సెల్ ఫోన్లలో బంధించారు. కింద ఉన్న ప్రజలు ధైర్యం చెబుతుండగా, ఆమెతో పాటు రైడ్ లో ఉన్న వ్యక్తి, "వారు నిన్ను పట్టుకుంటారు. దూకెయ్" అని ప్రోత్సహించాడు. ఆ వీడియోను మీరూ చూడవచ్చు.