: విమర్శిస్తే విపక్ష నేతలకు ఇక పోస్టుమార్టమే!: తెలంగాణ స్పీకర్ వివాదాస్పద వ్యాఖ్యలు


గ్రామాల్లో తిరుగుతూ కేసీఆర్ సర్కారును ఎవరైనా విపక్ష నేతలు విమర్శిస్తే వారికి అదే గ్రామంలో పోస్టుమార్టం చేస్తామని తెలంగాణ స్పీకర్ మధుసూధనాచారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన ప్రసంగిస్తూ, ఇతర పార్టీలకు చెందిన పలువురు నేతలు గ్రామాల్లో తిరుగుతూ, 'అది వచ్చిందా? ఇది వచ్చిందా? వారికి వచ్చింది... మీరు డిమాండ్ చేయండి' అంటూ రెచ్చగొడుతున్నారని ఆయన ఆరోపించారు. అటువంటి వారిని చూస్తూ ఊరుకోబోయేది లేదని హెచ్చరించిన ఆయన, తెలంగాణలోని ప్రతి ఒక్కరి అభివృద్ధికీ కేసీఆర్ కృషి చేస్తున్నారని తెలిపారు.

  • Loading...

More Telugu News