: టీడీపీ, బీజేపీ కలిసినందునే నాడు ఓడిపోయా, నేడు ఆరునూరైనా గెలిచేది నేనే: శిల్పా మోహన్ రెడ్డి
2014 ఎన్నికల సమయంలో తెలుగుదేశం, బీజేపీల మధ్య కుదిరిన పొత్తు కారణంగానే నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో తాను ఓడిపోయానని శిల్పా మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. నియోజకవర్గంలో నిర్ణయాత్మకమైన ఓటు బ్యాంకును కలిగివున్న ముస్లిం ఓటర్లు తెలుగుదేశం పార్టీకి దూరమయ్యారని, అదే తన ఓటమికి కారణమైందని అన్నారు. నంద్యాల నియోజకవర్గాన్ని తాను కూడా అభివృద్ధి చేశానని, ప్రస్తుతం నంద్యాలలో వైకాపా చాలా బలంగా ఉందని తెలిపారు. ఉప ఎన్నిక ఏకగ్రీవం కావడం అసాధ్యమని, అధికారం, డబ్బుతో తెలుగుదేశం గెలవాలని అనుకుంటున్నా ప్రజలు తనవైపే ఉన్నారని శిల్పా మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. త్వరలో జరిగే ఎన్నికల్లో ఆరునూరైనా గెలిచేది తానేనని చెప్పారు.