: సిగ్నల్ దగ్గర ట్రాఫిక్ క్లియర్ చేస్తున్న కానిస్టేబుల్ ను ఢీ కొట్టిన బెలూచిస్థాన్ ఎమ్మెల్యే కారు... వీడియో చూడండి
ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ట్రాఫిక్ ను క్లియర్ చేస్తున్న కానిస్టేబుల్ ను వెనుక నుంచి బలంగా ఢీ కొట్టిన దారుణం పాకిస్థాన్ లోని క్వెట్టాలో చోటుచేసుకుంది. ఘటన వివరాల్లోకి వెళ్తే.. క్వెట్టాలోని ఓ కూడలిలో హాజి అత్తా ఉల్లా అనే ట్రాఫిక్ కానిస్టేబుల్ విధులు నిర్వర్తిస్తున్నారు. వెళ్లాల్సిన వాహనాలకు దిశను చూపిస్తూ వేగంగా వెళ్లాలని సూచిస్తున్నారు. ఇంతలో వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు ఆయనను ఢీ కొట్టింది.
ఆ కారు బలూచిస్థాన్ అసెంబ్లీలో సభ్యుడు, పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి ఛైర్మన్ అయిన మాజిద్ అచాక్ జాయ్ అనే ప్రజాప్రతినిధిదిగా గుర్తించారు. ఆ సమయంలో ఆ కారును నడుపుతున్న వ్యక్తీ ఆయనే కావడం విశేషం. ఈ ఘటన సీసీ కెమెరాలో రికార్డయింది. కాగా, తీవ్రంగా గాయపడిన హాజీని స్థానికులు హుటాహుటీన ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు.