: కమ్ముకున్న మేఘాలు, కుమ్మేయనున్న వర్షాలు!


తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణాదిలోని పలు ప్రాంతాలను మేఘాలు కమ్ముకోగా, వచ్చే మూడు నాలుగు రోజుల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనానికి ఉపరితల ఆవర్తనం తోడు కావడమే ఇందుకు కారణమని అధికారులు పేర్కొన్నారు. అల్పపీడనం వాయుగుండంగా మారితే అతి భారీ వర్షాలు కూడా కురుస్తాయని, కొన్ని ప్రాంతాల్లో కుంభవృష్టికి అవకాశముందని అంచనా వేశారు. కాగా, గడచిన 24 గంటల్లో హైదరాబాద్ సహా వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, కర్నూలు, మహబూబ్ నగర్, చిత్తూరు, గుంటూరు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి.

  • Loading...

More Telugu News