: నంద్యాల ఉప ఎన్నికల్లో ఓడిపోతే నేను రాజకీయాల్లోంచి తప్పుకుంటా: అఖిల ప్రియ
నంద్యాల ఉపఎన్నికల్లో ఓటమిపాలైతే రాజకీయాల్లోంచి తప్పుకుంటానని టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ సంచలన ప్రకటన చేశారు. నంద్యాల ఉపఎన్నికల్లో విజయం భూమా కుటుంబంతో పాటు నంద్యాల కేడర్ కు కూడా ప్రెస్టీజియస్ అంశంగా మారిందని ఆమె చెప్పారు. ఉపఎన్నికల్లో విజయం తమదేనని ఆమె ధీమా వ్యక్తం చేశారు. పార్టీ విజయం సాధిస్తే ఈ ఘనత పార్టీ, కార్యకర్తలు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఘనత అవుతుందని ఆమె చెప్పారు. అలా కాకుండా ఓటమిపాలైతే మాత్రం ఆ వైఫల్యానికి పూర్తి బాధ్యత తనదేనని ఆమె చెప్పారు.