: నిరుపేద ముస్లింకు అండగా నిలిచి ఇల్లు కట్టించిన ప్రకాశ్ రాజ్!


ఏ క్షణం కుప్పకూలుతుందో తెలియని స్థితిలో ఇల్లున్న ఓ పేద ముస్లిం కష్టం గురించి తెలుసుకున్న విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్, తనదైన శైలిలో స్పందించారు. ప్రకాశ్ రాజ్ చేసిన పనితో ఆ ముస్లిం కళ్లలో రంజాన్ ఆనందం రెట్టింపయింది. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలంలోని కొండారెడ్డిపల్లి గ్రామాన్ని ప్రకాశ్‌ రాజ్‌ దత్తత తీసుకున్నారన్న సంగతి తెలిసిందే. తెలంగాణ సర్కారుతో కలసి గ్రామాన్ని అభివృద్ధి చేసే పలు కార్యక్రమాల్లో ప్రకాశ్ పాలుపంచుకుంటున్నారు. ఇదే గ్రామ నివాసి చోటేమియా ఇల్లు శిథిలావస్థకు చేరుకుందని తెలుసుకున్న ప్రకాశ్ రాజ్, ఆ ఇంటిని పడగొట్టి, అదే స్థానంలో రూ. మూడున్నర లక్షల రూపాయల వ్యయంతో అన్ని సౌకర్యాలతో కొత్త ఇంటిని నిర్మించి ఇచ్చారు. దీంతో ఆ కుటుంబం తమకు అద్భుతమైన రంజాన్ తోఫా దక్కిందన్న సంబరాల్లో ఉన్నారు.

  • Loading...

More Telugu News