: రియల్ లైఫ్ 'స్పైడర్ మ్యాన్'ను పట్టేసిన బెంగళూరు పోలీసులు!


రియల్ లైఫ్ స్పైడర్ మ్యాన్ ను బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. బెంగళూరులోని హసన్‌ ప్రాంతానికి చెందిన నవీన్‌ కుమార్‌ కి ఊహించని టాలెంట్‌ ఉంది. స్పైడర్‌ మ్యాన్‌ లా ఒక భవనం నుంచి మరో భవనం పైకి అవలీలగా దూకేస్తుంటాడు. సినిమాల్లో స్పైడర్ మ్యాన్ ప్రజలను రక్షించేందుకు ఈ టాలెంట్‌ ని వినియోగించగా, రియల్ స్పైడర్ మేన్ గా పేరొందిన నవీన్ కుమార్ మాత్రం తన టాలెంట్ ను దొంగతనానికి ఆయుధంగా వినియోగించుకుంటున్నాడు.

రెక్కీ నిర్వహించి, చోరీ చేసి, భవనాలపైనుంచి దూకి పరారవుతుంటాడు. ఈ నేపథ్యంలో జూన్‌ 21న అనంత రామయ్య అనే ఓ వృద్ధుడి ఇంట్లో చోరీ చేసి అతన్ని దారుణంగా హత్యచేసి పరారయ్యాడు. దీంతో దర్యాప్తు చేసిన పోలీసులు, నవీన్ ను హంతకుడిగా గుర్తించారు. దీంతో నాలుగు రోజులుగా నవీన్ ను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఎట్టకేలకు బెంగళూరు పోలీసులు అతనిని అరెస్టు చేశారు. 

  • Loading...

More Telugu News