: కొలంబియాలో మునిగిన పర్యాటకుల పడవ.. 9 మంది మృతి, 28 మంది గల్లంతు


వాయవ్య కొలంబియాలోని ఎల్ పెనోల్ రిజర్వాయర్‌లో  పర్యాటకులతో వెళ్తున్న పడవ మునిగిన ఘటనలో 9 మంది మృతి చెందగా 28 మంది గల్లంతయ్యారు. ప్రమాద సమయంలో బోటులో 170 మంది వరకు ఉన్నట్టు తెలుస్తోంది. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదని,  ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం 9 మంది మరణించారని అధికారులు తెలిపారు.

గల్లంతైన వారిలో చాలామందిని ఇతర బోట్లలో ఉన్న వారు రక్షించారని, మరికొందరు తప్పించుకున్నారని పేర్కొన్నారు. ప్రమాదంలో గల్లంతైన వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనేందుకు రిజర్వాయర్ వద్ద ఎయిర్‌ఫోర్స్, రెస్క్యూ సిబ్బందిని మోహరించినట్టు అధ్యక్షుడు జాన్ మాన్యుయెల్ శాంటోస్ ట్విట్టర్ ద్వారా తెలిపారు.

  • Loading...

More Telugu News