: జనసేనలో చేరికపై స్పదించిన రోజా!
జనసేనవైపుగా అడుగులు వేస్తున్నారంటూ వచ్చిన వార్తలపై వైఎస్సార్సీపీ మహిళా ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ, అదంతా తప్పుడు ప్రచారమని స్పష్టం చేశారు. తన శ్వాస ఉన్నంత వరకు వైఎస్సార్సీపీలోనే ఉంటానని అన్నారు. జీవితాంతం తాను జగనన్నకు రుణపడి ఉంటానని ఆమె చెప్పారు. విశాఖ భూస్కాంలో బొత్స సోదరుడి పాత్రలేదని తెలిపారు. వైజాగ్ భూ కుంభకోణంలో ఎవరి హస్తముందో రాష్ట్ర ప్రజలకు తెలుసని ఆమె చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీని మద్యాంధ్రప్రదేశ్ గా మార్చారని ఆమె మండిపడ్డారు. మంత్రి లోకేశ్ కు జగన్ ను పశ్నించే స్థాయి లేదని ఆమె చెప్పారు.