: జగన్ కు నేనివ్వనున్న బహుమతి ఇదే!: శిల్పా మోహన్ రెడ్డి
తనను ఆదరించి, నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీలో నిలిపిన వైఎస్ జగన్ కు గెలుపును బహుమతిగా ఇవ్వనున్నానని శిల్పా మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. నంద్యాల ఉప ఎన్నికల్లో గెలిచేది తానేనని వెల్లడించిన ఆయన, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను పక్కన బెట్టిందని విమర్శించారు. నిత్యమూ తన అనుచరుల మేలు కోసమే పాటుపడతానని, జగన్ ను ముఖ్యమంత్రిని చేయడమే తన లక్ష్యమని పేర్కొన్న ఆయన, పార్టీ పరంగా మాత్రమే తప్ప, కుటుంబపరంగా తన సోదరుడు చక్రపాణితో తనకు ఎటువంటి విభేదాలూ లేవని స్పష్టం చేశారు. త్వరలోనే జగన్ తో కలసి నియోజకవర్గమంతా పర్యటించనున్నానని, ఆ పర్యటనలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళతామని తెలిపారు.