: మీరు నా నుంచి సమాధానం రాబట్టాలనుకుంటున్నారు....కానీ నేను చెప్పను: మీడియాతో గంగూలీ


ముంబైలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో బీసీసీఐ సర్వసభ్యసమావేశం జరిగింది. ఈ సమావేశంలో బీసీసీఐ పాలకమండలితో పాటు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం టీమిండియా చీఫ్ కోచ్ ఎంపికపై వ్యాఖ్యానించేందుకు బీసీసీఐ కార్యదర్శి అమితాబ్ చౌదరి నిరాకరించారు, దీనిపై సలహాకమిటీ నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు.

 దీంతో క్యాబ్ ఛైర్మన్ సౌరవ్ గంగూలీని మీడియా ప్రశ్నించింది. దీంతో వారికి ఆయన సమాధానమిస్తూ...'మీరు నానుంచి సమాధానం రాబట్టాలని తీవ్రంగా ప్రయత్నిస్తారని నాకు ముందే తెలుసు...అయినా కానీ నేను సమాధానం చెప్పను' అని స్పష్టం చేశారు. ఇంతకీ టీమిండియాకు ఎలాంటి కోచ్ కావాలని అనుకుంటున్నారు? అన్న ప్రశ్నకు...జట్టును గెలిపించే కోచ్ కావాలి అని ఆయన సమాధానమిచ్చారు. 

  • Loading...

More Telugu News