: 500 మంది జవాన్లు... 60 గంటల పాటు తూటాల వర్షం... 12 మంది మావోల హతం!


చత్తీస్ గఢ్ లోని చింతగుఫా అడవుల్లో గడచిన మూడు రోజులుగా మావోయిస్టులు, భద్రతా దళాలకు మధ్య జరుగుతున్న భీకర ఎన్ కౌంటర్ ముగిసింది. సుమారు 60 గంటలకు పైగా సాగిన ఎన్ కౌంటర్ లో 12 మంది మావోయిస్టులు హతమయ్యారని పోలీసు డైరెక్టర్ జనరల్ అవస్తి పేర్కొన్నారు. ఇదే ఎన్ కౌంటర్ లో సీఆర్పీఎఫ్ కు చెందిన ముగ్గురు జవాన్లు మరణించారని ఆయన తెలిపారు. మొత్తం 500 మందికి పైగా జవాన్లు ఎదురు కాల్పుల్లో పాల్గొన్నారని తెలిపారు. కాగా, ఇటీవలి కాలంలో మధ్య భారతావనిలో జరిగిన భారీ ఎన్ కౌంటర్లలో ఇదే అతిపెద్దది.

  • Loading...

More Telugu News