: ప్రధాని మోదీ తరువాతి స్థానాన్ని ఆక్రమించిన కోహ్లీ!


ఇవాళా రేపు ఎవరికెంత పాప్యులారిటీ ఉందన్న ప్రశ్న ఉదయిస్తే, వారికి ఉన్న ఫేస్ బుక్, ట్విట్టర్ ఖాతాల్లో ఫాలోవర్ల సంఖ్యనే చూస్తారన్న సంగతి తెలిసిందే. ఇక ప్రపంచంలోనే ఎవరి ఫేస్ బుక్ ఖాతాను అత్యధికులు ఫాలో అవుతారన్న ప్రశ్న ఉదయిస్తే, వారిలో భారత ప్రధాని నరేంద్ర మోదీ టాప్ ర్యాంకుల్లో ఒకరిగా ఉంటారన్న సంగతి తెలిసిందే. ఇండియాకు సంబంధించినంత వరకూ మోదీ 4.22 కోట్ల మంది ఫాలోవర్లతో తొలి స్థానంలో ఉండగా, ఇంతవరకూ రెండో స్థానంలో సల్మాన్ ఖాన్ ఉండేవాడు. ఇప్పుడు సల్మాన్ స్థానాన్ని భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆక్రమించేశాడు. కోహ్లీని ప్రస్తుతం 3.57 కోట్ల మంది ఫాలో అవుతూ ఉండగా, సెలబ్రిటీల విభాగంలో ఆయన నంబర్ వన్.

  • Loading...

More Telugu News