: ఆఫ్ఘనిస్థాన్‌లో లో భారత్ నిర్మించిన డ్యామ్ వద్ద తాలిబన్ల దాడి.. 10 మంది పోలీసుల మృతి


ఆఫ్ఘనిస్థాన్‌లోని చస్ట్ జిల్లాలో భారత్ నిర్మించిన సల్మాడ్యామ్ వద్ద తాలిబన్లు జరిపిన దాడిలో పదిమంది పోలీసులు మృతి చెందగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఇక్కడి చెక్‌పోస్టు వద్దకు చేరుకున్న ఉగ్రవాదుల బృందం ఒక్కసారిగా పోలీసులపై కాల్పులు జరిపి పారిపోయినట్టు అధికారులు తెలిపారు.

సల్మా డ్యామ్‌ను జూన్ 2016లో ప్రధాని నరేంద్రమోదీ, ఆఫ్ఘాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ కలిసి ప్రారంభించారు. చిస్ట్-ఇ- షరీఫ్ నదిపై నిర్మించిన ఈ డ్యామ్ కోసం  భారత్ రూ.1,700 కోట్లు ఖర్చు చేసింది. ఈ డ్యామ్ ద్వారా 75 వేల హెక్టార్లకు నీరు అందడంతో 42 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయనున్నారు. తాజా దాడిపై ఆఫ్ఘనిస్థాన్‌లో భారత రాయబారి మన్‌ప్రీత్ ఓహ్రా మాట్లాడుతూ తాలిబన్ల దాడి లక్ష్యం డ్యామ్ కాదని పేర్కొన్నారు. డ్యామ్‌ను లక్ష్యంగా చేసుకుని దాడి జరిగినట్టు వస్తున్న వార్తలు నిజం కాదన్నారు. డ్యామ్‌కు చాలా దూరంలో దాడి జరిగినట్టు ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News