: గడ్డం, విగ్గు, కళ్లద్దాలు... 'డీజే' చూసి ఎంజాయ్ చేసేందుకు ఇలా వెళ్లిన టాలీవుడ్ యువ హీరో!


గడచిన శుక్రవారం నాడు విడుదలై, తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాల్లోనూ దూసుకెళుతున్న 'డీజే- దువ్వాడ జగన్నాథమ్' చిత్రాన్ని టాలీవుడ్ యువ హీరో రాజ్ తరుణ్, చడీ చప్పుడు కాకుండా అభిమానులతో కలసి చూసి ఎంజాయ్ చేశాడు. ప్రస్తుతం తన కొత్త చిత్రం షూటింగ్ నిమిత్తం అమలాపురం సమీపంలో ఉన్న రాజ్ తరుణ్, మారు వేషంలో వెళ్లి చూశాడు. అభిమానులు గుర్తు పడితే ఇబ్బందులు తప్పవని భావించాడో ఏమో, గడ్డం, విగ్గు, కళ్లద్దాలు పెట్టుకుని మరీ సినిమా చూసొచ్చి, అల్లు అర్జున్ పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు. అంతేకాదు... నేను సినిమా చూసొచ్చానని చెబుతూ ఆ ఫోటోను అభిమానులతో పంచుకున్నాడు. ఈ సినిమా చూడటానికి రాజ్ తరుణ్ ఏ వేషంలో వెళ్లాడో మీరూ చూడవచ్చు.

  • Loading...

More Telugu News