: వరంగల్ కలెక్టర్ ఆమ్రపాలి కార్యాలయంలో నాగుపాము హల్ చల్!
వరంగల్ జిల్లా కలెక్టర్ ఆమ్రపాలి కార్యాలయంలో నాగుపాము కలకలం రేపింది. గత కొన్ని రోజులుగా వర్షాలు పడుతూ ఉండటంతో, నేల చల్లగా మారగా, పలు ప్రాంతాల్లో విషసర్పాలు, చీడ పురుగులు బయటకు వస్తుండగా, చడీ చప్పుడూ లేకుండా కలెక్టర్ కార్యాలయంలోకి వచ్చేసిన పామును చూసి కార్యాలయ సిబ్బంది భయాందోళనలకు గురయ్యారు. ఆపై సమాచారాన్ని రెస్వ్యూ టీమ్ కు అందించగా, వారు వచ్చి స్నేక్ సొసైటీ సభ్యులకు కబురు పెట్టారు. వారు వచ్చి పామును పట్టుకుని దగ్గర్లోని అడవిలో వదిలేశారు. నిత్యమూ వందలమంది కలెక్టర్ క్యాంప్ ఆఫీసుకు వస్తుంటారన్న సంగతి తెలిసిందే. అయితే ఆదివారం కావడంతో జనాలు పెద్దగా లేరు. పైగా ఆమ్రపాలి కార్యాలయంలో లేని సమయంలో పాము రావడంతో పెద్దగా హంగామా జరగలేదు.