: కనిపించిన నెలవంక... రేపే రంజాన్!


హైదరాబాదులో ఈరోజు రాత్రి నెలవంక కనిపించింది. దీంతో, తెలుగు రాష్ట్రాల్లో రంజాన్ (ఈద్-ఉల్-ఫితర్) పండగ రేపు జరుపుకోవచ్చని రూహత్ హిలాల్ కమిటీ ఈ మేరకు ప్రకటించింది. కాగా, రంజాన్ నేపథ్యంలో ముస్లిం సోదరులకు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్, తెలంగాణ సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలియజేస్తూ వేర్వేరు ప్రకటనలు చేశారు. కాగా, రంజాన్ నేపథ్యంలో వస్త్ర దుకాణాలు, కంగన్ షాపులు, చెప్పుల దుకాణాలు...చాలా రద్దీగా ఉన్నాయి. ముఖ్యంగా పాతబస్తీలోని చార్మినార్ ప్రాంతంలో దుకాణాలు వినియోగదారులతో కిక్కిరిసిపోయాయి. 

  • Loading...

More Telugu News