: ప్రభాస్ ‘వద్దు’ అనుకుంటే ఏదైనా సరే చెయ్యడు: రాజమౌళి


హీరో ప్రభాస్ ఏదైనా సరే ‘వద్దు’ అనుకుంటే చెయ్యడు, కావాలి అనుకుంటే బతిమాలో, బామాలో సాధిస్తాడని ప్రముఖ దర్శకుడు రాజమౌళి అన్నారు. ఓ న్యూస్ ఛానెల్ తో ఆయన మాట్లాడుతూ, ‘‘బాహుబలి’ చిత్రంతో ప్రభాస్ మార్కెట్ విపరీతంగా పెరిగిపోయింది. ఆయనకు మీరేమన్నా సలహాలు ఇచ్చారా?’ అని ప్రశ్నించగా.. రాజమౌళి సమాధానమిస్తూ, ‘ప్రభాస్ కు చెప్పాల్సిన అవసరం లేదు. గ్రౌండ్ లెవెల్ లో ఆలోచిస్తాడు. తన ప్లస్ పాయింట్లు, మైనస్ పాయింట్ల గురించి ప్రభాస్ కన్నా బాగా ఎవ్వరికీ తెలియవు. చాలా నీట్ గా, కరెక్టుగా ఆలోచిస్తాడు. ప్రభాస్ ప్లానింగ్ అంతా పక్కాగా ఉంటుంది. ప్రభాస్ ‘వద్దు’ అనుకున్నదేదీ చెయ్యడు. ఎంత ఒత్తిడి చేసినా, మొహమాట పెట్టినా చాలా మర్యాదగా ‘నో’ అని చెబుతాడు. ప్రభాస్ చెయ్యాలనుకున్నది మాత్రం ఎలాగైనా సరే, ఎవరినీ నొప్పించకుండా చేస్తాడు. నాతో చాలా క్లోజ్ గా ఉంటాడు. అతని ప్లాన్స్ గురించి చెబుతుంటాడు’ అని రాజమౌళి చెప్పుకొచ్చారు.  

  • Loading...

More Telugu News