: నా ప్రసంగాన్ని నాడు మీరాకుమార్ ఎలా అడ్డుకున్నారో ఈ వీడియో చూస్తే తెలుస్తుంది!: సుష్మా స్వరాజ్


యూపీఏ ప్రభుత్వం పలు అవినీతి కుంభకోణాలకు పాల్పడిందంటూ నాడు లోక్ సభలో తాను ప్రతిపక్ష నేత హోదాలో మాట్లాడిన సమయంలో అప్పటి స్పీకర్ మీరాకుమార్ ‘ఇక చాలంటూ’ తనను ఆపే ప్రయత్నం చేసిన విషయాన్ని ప్రస్తుత కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్ ప్రస్తావించారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో ఆమె పోస్టు చేశారు. 2013 ఏప్రిల్ లో లోక్ సభలో తాను మాట్లాడుతుండగా ప్రతిపక్షనేత పట్ల నాటి స్పీకర్ మీరాకుమార్ వ్యవహరించిన తీరుకు ఈ వీడియోనే నిదర్శనం అని పేర్కొన్నారు. దేశానికి సంబంధించిన ఒక ప్రాధాన్యమున్న అంశంపై తాను మాట్లాడుతుంటే మీరాకుమార్ పదే పదే జోక్యం చేసుకుని సుష్మా ప్రసంగాన్ని ముగించాలని ఒత్తిడి చేయడం ఈ వీడియోలో కనపడుతుంది.

  • Loading...

More Telugu News