: ఆ చిన్నారి ముఖంలో చిరునవ్వులు పూయించిన మహేశ్ బాబుకి థ్యాంక్స్ చెప్పిన భార్య నమ్రత!
ఓ మానసిక వికలాంగురాలి స్వప్నాన్ని సాకారం చేసిన తన భర్త మహేశ్ బాబుకు ధన్యవాదాలు చెబుతున్నానని ఆయన భార్య నమ్రత చెప్పారు. ఈ మేరకు తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో ఓ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఎంతో బిజీగా ఉన్న మహేశ్ బాబు, ఆ చిన్నారి కలను నెరవేర్చి, ఆనందానికి గురి చేశారని భర్తపై ప్రశంసలు కురిపించారు.
‘పద్నాలుగు సంవత్సరాల సుస్మిత మానసిక వికలాంగురాలు. మహేశ్ బాబుకు ఆమె వీరాభిమాని. ఈ క్రమంలో ‘హీల్ ఏ చైల్డ్ ఫౌండేషన్’ సంస్థను సుస్మిత తల్లిదండ్రులు సంప్రదించి ఈ విషయాన్ని చెప్పారు. ఆ చిన్నారి ముఖంలో చిరునవ్వులు పూయించిన మిస్టర్ మహేశ బాబు, థ్యాంక్యూ’ అని నమ్రత తన పోస్ట్ లో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన ఓ ఫొటోను నమ్రత పోస్ట్ చేశారు.