: బోండా ఉమకు బుద్ధి చెబుతాం: బ్రాహ్మణ ఆత్మగౌరవ సభలో నేతలు
ఏపీ బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఐవైఆర్ కృష్ణారావుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమకు బ్రాహ్మణులు తగిన విధంగా బుద్ధి చెబుతారని బాపట్ల వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కోన రఘుపతి అన్నారు. గుంటూరులో ఈ రోజు జరిగిన బ్రాహ్మణ ఆత్మగౌరవ సభలో ఆయన మాట్లాడుతూ, ఐవైఆర్ పై విమర్శలు చేయడం తగదని, టీడీపీ నేతలు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని ఈ సందర్భంగా హెచ్చరించారు. డిసెంబర్ లో లక్షలాది మంది బ్రాహ్మణులతో సభను నిర్వహిస్తామని చెప్పారు. ఈ సభలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మల్లాది విష్ణు మాట్లాడుతూ, బోండా ఉమ ఓ వీధి రౌడీలా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. ‘ఫేస్ బుక్’లో మంత్రి నారా లోకేష్ పై పోస్టులు పెట్టిన వారిని అరెస్టు చేశారని, మరి, ఐవైఆర్ పై పోస్టులు పెట్టిన వారిని ఎందుకు అరెస్టు చేయరని ప్రశ్నించారు.