: భూ కుంభకోణాలను ప్రభుత్వం పరిష్కరించకుంటే ప్రజలే పరిష్కరించుకుంటారు: సీపీఐ నారాయణ
విశాఖపట్టణంలో భూ కుంభకోణాలను ప్రభుత్వం పరిష్కరించని పక్షంలో ప్రజలే పరిష్కరించుకుంటారని సీపీఐ నారాయణ అన్నారు. విశాఖ భూ ఆక్రమణల పరిశీలన అనంతరం, ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘ఉంటే గుడిసెల్లో ఉండండి..లేదంటే జైల్లో ఉండండి’ అని పిలుపు నిస్తామని అన్నారు. ఈ కుంభకోణానికి సంబంధించి సిట్ నివేదిక చిత్తు కాగితంతో సమానమని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. భూకుంభకోణంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఈ సందర్భంగా నారాయణ డిమాండ్ చేశారు. కాగా, భూ ఆక్రమణల పరిశీలన నిమిత్తం ఈ రోజు అక్కడికి వెళ్లిన నారాయణ, ఫెన్సింగ్ గోడను తన్నుతుండగా గాయపడ్డారు. దీంతో, స్వల్పగాయాలైన ఆయన్ని ఆసుపత్రికి తరలించారు.