: రోడ్డు ప్రమాదంలో హీరో రవితేజ సోదరుడు, నటుడు భరత్ రాజు మృతి
రంగారెడ్డి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో హీరో రవితేజ సోదరుడు, నటుడు భరత్ రాజు మరణించారు. ఆయన ప్రయాణిస్తున్న కారు ఆగివున్న లారీని ఢీకొనడంతో, తీవ్ర గాయాల పాలైన భరత్ రాజు అక్కడికక్కడే కన్నుమూశారు. శంషాబాద్ మండలం కొత్వాల్ గూడ సమీపంలో ఔటర్ రింగ్ రోడ్డుపై ఈ ఘటన జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఇప్పుడే ఘటనా స్థలికి చేరుకున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణంగా పోలీసు వర్గాలు భావిస్తున్నాయి. భరత్ రాజు మృతిపై మరింత సమాచారం వెలువడాల్సివుంది.