: విరబూసిన నాగమల్లులు... తిరుమలకు సరికొత్త అందాలు!
ప్రతి సంవత్సరమూ వర్షాకాల సీజన్ ఆరంభంలో తిరుమలలో కనువిందు చేసే నాగమల్లి చెట్లు విరబూశాయి. గులాబీ రంగులో రేకులు, మధ్యలో నాగుపాము పడగ ఆకారంలో కనిపిస్తూ, పసుపు రంగు పుప్పొడితో ఉండే ఈ పూలను శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైనవిగా భావిస్తారు. వీటి నుంచి సువాసన కూడా వస్తుంది. కొమ్మలకు, రెమ్మలకు కాకుండా, కాండానికి పూయడం వీటి ప్రత్యేకత. నాగుపాము పడగలా కనిపిస్తుంది కాబట్టి వీటిని నాగమల్లిగా పిలుస్తారు. తిరుమలలో ఈ చెట్లు విరివిగా ఉన్నాయి. చెట్టు నేల నుంచి కొమ్మలు విస్తరించినంత వరకూ విరబూసిన నాగమల్లి చెట్లను ఆసక్తిగా తిలకిస్తున్న శ్రీవారి భక్తులు, ఈ పుష్పాలతో సెల్ఫీలు దిగుతూ ఆనందిస్తున్నారు.