: నాకు మరణం ప్రసాదించరూ.. రాష్ట్రపతిని వేడుకున్న ఒడిశావాసి దీనగాథ!


వెన్నెముక గాయంతో బాధపడుతూ 15 ఏళ్లుగా మంచంపైనే ఉన్న ఓ వ్యక్తి తనకు అనాయాస మరణం (ఈజీ డెత్) ప్రసాదించాల్సిందిగా రాష్ట్రపతిని వేడుకున్నాడు. ఒడిశాలోని అసరాడ గ్రామానికి చెందిన మురళీధర్ సాహు ఓ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. అతడి వెన్నెముక పనికిరాకుండా పోయింది. దీంతో అతను గత పదిహేనేళ్లుగా మంచానికే పరిమితమయ్యాడు. ప్రస్తుతం అతడికి ‘నా’ అన్నవాళ్లు ఎవరూ లేరు. చాలా ఏళ్ల క్రితమే తల్లి చనిపోగా ప్రమాదం జరిగిన తర్వాత కొన్ని నెలలకే భార్య ఆత్మహత్య చేసుకుంది.

దీంతో అతడి ఆలనాపాలనా చూసేవారు ఎవరూ లేకుండా పోయారు. అప్పుడప్పుడు గ్రామస్థులే ఆయనకు ఆహారం అందిస్తున్నారు. శరీరాన్ని అంగుళం కూడా కదిలించలేని సాహు అతి కష్టం మీద కొన్ని పదాలను మాత్రం పలుకుతున్నాడు. తనను చూసేవారు ఎవరూ లేరని, నొప్పి భరించలేకపోతున్నానని, కాబ్టటి తనకు మరణం ప్రసాదించాలని సాహు రాష్ట్రపతిని వేడుకున్నాడు. తనను ఆదుకోవాలంటూ జిల్లా కలెక్టర్, ముఖ్యమంత్రికి పలుమార్లు విన్నవించుకున్నా వారి నుంచి సాహుకు ఎటువంటి సాయం అందలేదని గ్రామస్థులు తెలిపారు.

  • Loading...

More Telugu News