: రెండు అరుదైన రికార్డులు నెలకొల్పిన మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్
మహిళల క్రికెట్ వరల్డ్ కప్ లో భాగంగా ఇంగ్లండ్ తో జరిగిన మ్యాచ్ లో టీమిండియా విజయం సాధించగా, కెప్టెన్ మిథాలీ రాజ్ రెండు అరుదైన రికార్డులను నెలకొల్పింది. ఓ మహిళా క్రికెటర్ గా 47 వన్డే హాఫ్ సెంచరీలను చేసిన ఘనతను సొంతం చేసుకుంది. ఇదే సమయంలో 7 వరుస వన్డే మ్యాచ్ లలో హాఫ్ సెంచరీలు చేసిన రికార్డూ ఆమె సొంతమైంది. శ్రీలంకపై 70, సౌతాఫ్రికాపై 64, బంగ్లాదేశ్ పై 73, సౌతాఫ్రికాపై వరుసగా 51, 54, 62 పరుగులు చేసిన మిథాలీ, ఇంగ్లండ్ తో మ్యాచ్ లో 71 పరుగులు చేసింది. ఇక మరో రికార్డు ఆమె ముందు సిద్ధంగా ఉంది. ఇప్పటికే 178 మ్యాచ్ లు ఆడి 5,852 పరుగులు సాధించి ఆమె, ప్రపంచంలో 6 వేల పరుగులు పూర్తి చేయనున్న తొలి మహిళా క్రికెటర్ గా అవతరించేందుకు ఎంతో సమయం పట్టక పోవచ్చు.