: శ్రీనగర్ పాఠశాలలో ఉగ్రవాదులు... మట్టుబెట్టేందుకు కొనసాగుతున్న భీకర ఎన్ కౌంటర్


నిన్న సీఆర్పీఎఫ్ 29వ బెటాలియన్ పై దాడికి దిగిన ఉగ్రవాదులు తప్పించుకుని శ్రీనగర్ - జమ్మూ జాతీయ రహదారిపై ఉన్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లో జొరబడటంతో వాళ్లను మట్టుబెట్టేందుకు భద్రతా దళాలు ఎన్ కౌంటర్ ప్రారంభించాయి. ఈ తెల్లవారుజామున 3:40 గంటల నుంచి ఎన్ కౌంటర్ సాగుతోందని, పాఠశాలలో నక్కిన ఉగ్రవాదులు కూడా కాల్పులు జరుపుతూ ఉన్నారని అధికారులు తెలిపారు.

 దీంతో ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయించామని, నిన్నటి ఘటనలో ఓ సబ్ ఇనస్పెక్టర్ మరణించగా, ఇద్దరు జవాన్లకు గాయాలు అయ్యాయని వెల్లడించారు. చినార్ కార్ప్స్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ కార్యాలయానికి కిలోమీటరు దూరంలోనే ఈ పాఠశాల ఉండటం గమనార్హం. దాదాపు 400కు పైగా గదులున్న ఈ పెద్ద స్కూల్ లో ఉగ్రవాదులు ఉన్న ప్రాంతాన్ని గమనించామని, కనీసం ఇద్దరు లేదా ముగ్గురు ఉగ్రవాదులు ఉండవచ్చని అధికారులు అంటున్నారు.

  • Loading...

More Telugu News