: ఈ రెండు తప్పులూ... చిన్నారిని 10 అడుగుల లోతు నుంచి 400 అడుగులకు తోసేశాయి!


గురువారం సాయంత్రం 6:30 గంటలకు రంగారెడ్డి జిల్లాలోని మూతలేని బోరుబావిలో పడ్డ 14 నెలల చిన్నారి ఘటన విషాదాంతం కాగా, అధికారులు, స్థానిక ప్రజలు చేసిన రెండు తప్పులు 10 అడుగుల లోతున ఉన్న పాపను 400 అడుగుల లోతుకు తోసేశాయి. బావిలో చిన్నారి పడిన తరువాత పావు గంట వ్యవధిలోనే తల్లిదండ్రులకు, స్థానికులకూ తెలియగా, కేవలం 10 అడుగుల లోతున ఆమె ఉన్నట్టు గుర్తించి, తాళ్ల సాయంతో బయటకు తీసేందుకు ప్రయత్నించారు.

ఈ ప్రయత్నం బెడిసికొట్టగా, పాప మరింత లోతుకు జారిపోయి, 40 అడుగుల లోతున ఉన్న సబ్ మెర్సిబుల్ మోటారుపై పడింది. ఆపై అధికారులు రంగంలోకి దిగగా, సహాయక చర్యలు ముమ్మరం అయ్యాయి. శుక్రవారం మధ్యాహ్నం వరకూ పాప 40 అడుగుల లోతునే ఉంది. మోటారు బయటకు తీస్తే, పాప కూడా బయటకు వస్తుందన్న అంచనాతో మోటారును బయటకు లాగారు. ఈ ప్రయత్నం విఫలమైంది. బావి ఎంత లోతునకు తీశారో అంత లోతుకు పాప జారిపోయింది. మోటారును తెచ్చే క్రమంలోనే పాప ప్రాణాలు పోయుంటాయని ఇప్పుడు అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఈ రెండు తప్పులూ జరక్కుండా ఉండివుంటే పాప ప్రాణాలతో దక్కేదని భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News