: వాషింగ్టన్ చేరుకున్న మోదీ... చూసేందుకు ఎగబడ్డ ప్రవాసులు


మూడు దేశాల పర్యటనలో భాగంగా పోర్చుగల్ నుంచి అమెరికాకు బయలుదేరిన భారత ప్రధాని నరేంద్ర మోదీ, వాషింగ్టన్‌ చేరుకున్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం వచ్చిన ఆయనకు, అధికారులతో పాటు ప్రవాస భారతీయుల నుంచి ఘన స్వాగతం లభించింది. మోదీకి వందలాది మంది భారతీయులు మువ్వన్నెల జెండాలను ఊపుతూ స్వాగతం పలికారు. ఆయన్ను చూసేందుకు వీలైతే చెయ్యి కలిపేందుకు పోటీ పడ్డారు. మోదీ సైతం ఉత్సాహంతో చేతలు ఊపుతూ, కొంతమంది దగ్గరకు వెళ్లి కరచాలనం చేశారు. అమెరికాలో భారత దౌత్యాధికారులతో పాటు ప్రభుత్వ పెద్దలు మోదీకి వెల్ కమ్ చెప్పారు. కాగా, నేడు ఆయన పలు అమెరికా కంపెనీల సీఈవోలను కలసి మాట్లాడటంతో పాటు, సాయంత్రం వర్జీనియాలో ప్రవాస భారతీయ సంఘాలతో భేటీ కానున్నారు. రేపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తో మోదీ సమావేశం అవుతారన్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News