: పేటీఎం సూపర్ ఆఫర్.. స్మార్ట్‌ఫోన్లపై రూ.10వేల క్యాష్ బ్యాక్!


మొబైల్ వ్యాలెట్ సంస్థ పేటీఎం అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. జీఎస్టీ ఏర్పాటుకు వారం రోజుల ముందు స్మార్ట్‌ఫోన్లపై భారీ క్యాష్ బ్యాక్ ఆఫర్ చేసింది. ఫింగర్ ప్రింట్ స్కానర్లు కలిగిన స్మార్ట్ ఫోన్లపై ఏకంగా రూ.10 వేల క్యాష్ బ్యాక్ ప్రకటించి వినియోగదారులను తనవైపు ఆకర్షించుకుంది. ఐఫోన్ 7, ఐఫోన్ 7 ప్లస్, ఐఫోన్ ఎస్ఈ, గూగుల్ పిక్సెల్, ఒప్పో ఎఫ్ 3, వివో వీ5ఎస్, హెచ్‌టీసీ డిజైర్ 10 ప్రొ తదితర స్మార్ట్‌ఫోన్లకు ఈ ఆఫర్ వర్తిస్తుంది.

క్యాష్ బ్యాక్ పొందేందుకు వినియోగదారులు డెడికేటెడ్ పేజ్‌పై ఉండే ప్రొమోషనల్ కోడ్స్‌ను అప్లై చేయాల్సి ఉంటుందని పేటీఎం తెలిపింది. నేటి (ఆదివారం) వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని పేర్కొంది. క్యాష్ ఆన్ డెలివరీ (సీఓడీ)కి ఈ ఆఫర్ వర్తించదని, డెబిట్, క్రెడిట్, నెట్ బ్యాంకింగ్ ద్వారా మొబైళ్లు కొనుగోలు చేసే వారికి మాత్రమే క్యాష్ బ్యాక్ వర్తిస్తుందని వివరించింది.

  • Loading...

More Telugu News