: భారత్ మొత్తం ఇస్లామోఫోబియా వ్యాపించింది.. వారికి, వీరికి తేడాలేదు: అసదుద్దీన్


భారతదేశం మొత్తం ఇస్లామోఫోబియా వ్యాపించిందని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైస్ అన్నారు. హరియాణాలోని ఓ రైలులో జరిగిన 17 ఏళ్ల ముస్లిం యువకుడు జునైద్ హత్యను ఖండించిన ఆయన మాట్లాడుతూ దేశం ద్వేషపూరిత వాతావరణంతో నిండిపోయిందన్నారు. దీనిని తాను ఇస్లామోఫోబియాగా వర్ణిస్తున్నట్టు చెప్పారు. ఇస్లామోఫోబియాతో బాధపడుతున్నవారు గోవు పేరు చెప్పి ముస్లింలను హత్య చేస్తున్నారని ఆరోపించారు. శ్రీనగర్‌లోని జామియా మసీదు బయట ఆందోళనకారుల చేతిలో మరణించిన డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్  పోలీస్ ఆయూబ్ హత్యను కూడా ఒవైసీ ఖండించారు. మతం, గోవు పేరుతో ముస్లింలను చంపుతున్నవారికి, ఆయూబ్‌ను హత్య చేసిన వారికి మధ్య పెద్దగా తేడాలేదన్నారు. కశ్మీర్‌లో ప్రస్తుత పరిస్థితులకు అక్కడి బీజేపీ, పీడీపీ ప్రభుత్వమే కారణమని ఒవైసీ నిందించారు.

  • Loading...

More Telugu News