: మైక్ ద్వారా పాప గొంతును మాత్రమే వినిపించగలిగాం... ఇంతకన్నా బాధ మరొకటి లేదు: మంత్రి మహేందర్ రెడ్డి


బోరు బావిలో పడ్డ చిన్నారిని ఎంతగా శ్రమించినా ప్రాణాలతో బయటకు తేలేకపోయామని, ఆ పాప గొంతును మాత్రమే తల్లిదండ్రులకు వినిపించగలిగామని మంత్రి మహేందర్ రెడ్డి వ్యాఖ్యానించారు. పాప ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న వేళ, హై రెజల్యూషన్ కెమెరాను లోపలికి పంపి అక్కడి దృశ్యాలను చిత్రీకరించామని, ఆ సమయంలో పాప ఏడుపును తల్లిదండ్రులు విన్నారని, అదే వారికి మిగిలిందని ఆయన అన్నారు. పాప మాటలను తల్లి విందని, లోపలున్న స్పీకర్ ద్వారా తల్లి మాటలను కూడా పాపకు వినిపించామని పేర్కొన్నారు.

పాప కడసారి చూపును దక్కించలేకపోయామని, 400 అడుగుల లోతులోని ఊబిలో ఉన్న మృతదేహాన్ని బయటకు తెచ్చే క్రమంలో ముక్కలైన అవయవాలు మాత్రమే తేగలిగామని తెలిపారు. ఆ పాప మృతదేహం అవయవాలను తిరిగి అతికించే పరిస్థితి కూడా లేదని, వాటిని పోస్టుమార్టం చేసేందుకు తరలించామని వెల్లడించారు. బాలిక చివరి గుర్తుగా దుస్తులు మాత్రమే మిగిలాయని, వాటిని తల్లిదండ్రులకు అప్పగిస్తామని అన్నారు.

  • Loading...

More Telugu News