: పోర్చుగల్ ప్రధాని మోదీకి ఇచ్చిన షడ్రసోపేత విందులో మెనూ ఇది!


తమ దేశంలో పర్యటనకు వచ్చిన భారత ప్రధాని నరేంద్ర మోదీకి పోర్చుగల్ ప్రధాని ఆంగోనియో కోస్టా ప్రత్యేక గుజరాతీ విందును ఏర్పాటు చేశారు. ఈ విందు మెనూ కార్డు ఇప్పుడు బయటకు వచ్చింది. విందులో అఖూ షాక్, సాగ్ కోఫ్తా, రాజ్మా ఔర్ మకాయ్, తుర్ఖా దాల్, కేసర్ రైస్, పరాఠా, రోడీ, పాపడ్, మ్యాంగో శ్రీఖండ్, గులాబ్ జామూన్, గుడ్డు లేని యాపిల్ స్ట్రూడెల్, వెనీలా ఐస్ క్రీమ్, సోబ్రెమీసా ఇండియానా వరీడాలను మోదీకి వడ్డించేందుకు సిద్ధం చేశారు.

భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి గోపాల్ బాగ్లే, తన ట్విట్టర్ ఖాతాద్వారా, విందు మెనూను భారతీయులతో షేర్ చేసుకున్నారు. 2000 సంవత్సరంలో అప్పటి ప్రధాని వాజ్ పేయి తరువాత, పోర్చుగల్ ను సందర్శించిన తొలి భారత ప్రధాని నరేంద్ర మోదీయేనన్న సంగతి విదితమే. పోర్చుగల్ లో తన పర్యటనను ముగించుకున్న మోదీ, యూఎస్ చేరుకున్నారు.

  • Loading...

More Telugu News