: 60 గంటల శ్రమ వృథా... బయటకు వచ్చిన దుస్తులు, ఛిద్రమైన శరీర భాగాలు!


తెలంగాణ రాష్ట్ర మంత్రులు, కలెక్టర్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, పోలీసులు, శ్రామికులు పడ్డ 60 గంటల శ్రమ వృథా అయింది. రంగారెడ్డి జిల్లా ఇక్కారెడ్డి గూడెంలో బోరు బావిలో ప‌డిన‌ చిన్నారి మరణించిందని మంత్రి మహేందర్ రెడ్డి ప్రకటించిన తరువాత పాప మృతదేహాన్ని బయటకు తెచ్చేందుకు వాక్యూమ్ పైప్ విధానాన్ని వాడారు. ఆ వెంటనే పాప ధరించిన దుస్తులతో పాటు ముక్కలైన శరీర అవయవాలు బయటకు వచ్చి ఎగిరి పడ్డాయి. ప్రమాదం జరిగిన రోజున పాప ధరించిన డ్రస్ ను చూడగానే ఆ తల్లి షాక్ తో అపస్మారక స్థితిలోకి వెళ్లగా, అక్కడే ఉన్న ఆంబులెన్స్ లో చికిత్సను అందించారు.

పాప దూరం కావడం అత్యంత దురదృష్టకరమైన ఘటనగా అభివర్ణించిన మహేందర్ రెడ్డి, ఇకపై ఇటువంటి ఘటనలు జరుగకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు. పాపను ప్రాణాలతో తెచ్చేందుకు అధికారులు ఎంతో శ్రమించారని, అయినా ఫలితం లేకుండా పోవడం బాధను కలిగించిందని అన్నారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని, ఈ విషయంలో కేసీఆర్ ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారని అన్నారు. పాప మొత్తం అవయవాలు బయటకు వచ్చాయని, పోస్టుమార్టం తరువాత మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగిస్తామని అన్నారు.

  • Loading...

More Telugu News