: అమ్మా బైలెల్లినాదో... ఆషాడం వచ్చేసింది, బోనాల సందడి మొదలైంది


తెలంగాణలో బోనాల సందడి మొదలైంది. ఆషాఢ మాసం వచ్చీ రాగానే తొలి ఆదివారం కూడా రావడంతో, గోల్కొండ కోటలోని జగదాంబ మహంకాళి అమ్మవారికి ఇవాళ భక్తులు తొలి బోనాన్ని సమర్పించనున్నారు. తొలుత లంగర్ హౌస్ నుంచి ఘటాల ఊరేగింపు ప్రారంభం కానుంది. ఇప్పటికే గోల్కొండ ప్రాంగణమంతా డప్పు చప్పుళ్లు, శివసత్తుల పూనకాలు, పోతురాజుల విన్యాసాలతో ధూంధూం వాతావరణం నెలకొంది.

ప్రభుత్వం తరఫున మంత్రులు అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు. గ్రీష్మ రుతువు ముగిసి వర్ష రుతువు ప్రారంభమైన వేళ, వాతావరణ మార్పులతో వచ్చే పలు రకాల రోగాలను అమ్మవారు నయం చేస్తుందని భక్తులు గట్టిగా విశ్వసిస్తారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందీ లేకుండా అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశామని అధికారులు తెలిపారు. మరోవైపు రంజాన్ వేడుకలకు ముస్లిం సోదరులు సిద్ధం కావడంతో గోల్కొండ గుడి వద్ద పోలీసులు పెద్దఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు.

  • Loading...

More Telugu News