: శ్రీలంక క్రికెట్ టీమ్ చీఫ్ కోచ్‌ రాజీనామా


ఇంగ్లండ్‌లో జ‌రిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో శ్రీ‌లంక రాణించ‌లేక‌పోయిన విష‌యం తెలిసిందే. దాని ప్రభావంగా ఆ జట్టు చీఫ్‌ కోచ్ గ్రాహమ్ ఫోర్డ్ బాధ్యతల నుంచి తప్పుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించాడు. గ్రూప్ ద‌శ మ్యాచుల్లో భార‌త్‌పై మాత్ర‌మే శ్రీ‌లంక విజ‌యం సాధించి, ఇత‌ర మ్యాచుల్లో ఘోరంగా ఓడిపోయింది. దీంతో త‌మ క్రికెట్ జ‌ట్టు క్రికెటర్లకి ఫిటెనెస్ లేద‌ని ఆ దేశ క్రీడల మంత్రి విమ‌ర్శించారు.

అయితే బౌలర్ లసిత్ మలింగ త‌మ‌పై అటువంటి వ్యాఖ్య‌లు చేసిన‌ సదరు మంత్రిని కోతి అంటూ ప‌లు వ్యాఖ్య‌లు చేశాడు. మ‌రోవైపు జట్టులోని ఆటగాళ్లకి క్రమశిక్షణ, ఫిటెనెస్ విషయంలో  గ్రాహమ్ బాధ్య‌తారాహిత్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్నాడ‌ని కూడా ప‌లువురు విమ‌ర్శ‌లు చేశారు. దీంతో బోర్డుతో మాట్లాడిన అనంత‌రం గ్రాహ‌మ్ తాను చీఫ్‌ కోచ్ బాధ్య‌త‌ల నుంచి త‌ప్పుకుంటున్న‌ట్లు తెలిపాడు.      

  • Loading...

More Telugu News