: గుంటూరు జిల్లా మాచర్లలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు.. టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ!


గుంటూరు జిల్లా మాచర్లలో ఈ రోజు ప్ర‌తిప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్వ‌హించిన ఓ ప్ర‌ద‌ర్శ‌న‌లో ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. తమ పార్టీ ప్లీన‌రీ సందర్భంగా ఆ ప‌ట్ట‌ణంలో వైసీపీ కార్యక‌ర్త‌లు పెద్ద ఎత్తున‌ ర్యాలీగా అక్క‌డి తెలుగుదేశం కార్యాల‌యం మీదుగా వెళుతున్నారు. ఈ సందర్భంగా వైసీపీ కార్యకర్తలు కొందరు ఈలలు వేశారు. దీంతో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. అంతేకాదు ఇరు వర్గాలు రాళ్లు రువ్వుకున్నట్టు తెలుస్తోంది. దీంతో గొడ‌వ చెలరేగుతుందని భావించిన పోలీసులు వైసీపీ కార్య‌క‌ర్త‌ల ప్ర‌ద‌ర్శ‌న‌ను వేరే మార్గంలో వెళ్లమ‌ని చెప్పారు. అయితే, పోలీసుల తీరుకు నిర‌స‌న‌గా వైసీపీ కార్య‌క‌ర్త‌లు ఆందోళ‌న‌కు దిగడంతో పోలీసుల‌తో వారికి వాగ్వివాదం జరుగుతోంది.    

  • Loading...

More Telugu News